బద్వేలు వాసులకు GOOD NEWS
KDP: బద్వేలు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నుల్లో ఇంకా చెల్లించక అందుకు వడ్డీ కూడా వచ్చి ఉంటే వడ్డీలో సగభాగం కట్టే అవకాశం ప్రభుత్వం ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. జీవో నంబర్ 58 ప్రకారం ఆస్తి పన్నును ఒకేసారి అసలు చెల్లిస్తూ అందుకు వచ్చిన వడ్డీలో సగభాగం చెల్లించవచ్చన్నారు. బకాయి దారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.