VIDEO: తండ్రిని కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

SRPT: తుంగతుర్తి మండలం వెంపటికి చెందిన సన్నాయిల వెంకటేష్ ఇటీవల మరణించడంతో అతని ఇద్దరు కూతుర్లకు ఎమ్మెల్యే సామేలు అండగా నిలిచారు. సోమవారం తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరి కూతుర్ల పేరు మీద రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఆ కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.