VIDEO: పాఠశాల వంట గదిలో ఊడిన పడిన పెచ్చులు
CTR: చౌడేపల్లె మండలం మర్రిమాకులపల్లి ZP ప్రాథమిక పాఠశాలలో సోమవారం వంట గదిలోని పైకప్పు పెచ్చులూడి పూర్తిగా కింద పడ్డాయి. ఆ సమయంలో వంట మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాణ్యత లేని పనులు చేయడంతోనే ఇలా జరిగిందని పాఠశాల కమిటీ ఛైర్మన్ నాగేంద్ర ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.