వృద్ధురాలి గొలుసు చోరీ.. ముగ్గురు మహిళల అరెస్ట్
SRPT: కేసారంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో గొలుసు దొంగిలించిన ముగ్గురు మహిళలను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ నెల 19న బుచ్చమ్మ (75) ఇంట్లో ఉండగా తులం బంగారం అపహరించారు. కుమారుడు మల్లయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ నిందితులను పట్టుకున్నారు. రామ్లా తండాకు చెందిన పద్మ, నీలమ్మ, చిలకమ్మలను రిమాండ్‌కు తరలించారు.