VIDEO: 'మా ధాన్యం వెంటనే కొనాలి'

ELR: అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం.. మా ధాన్యం వెంటనే కొనుగోలు చేయండి మహా ప్రభు అంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ నినాదాలు చేశారు. ముందుగా రైతు సంఘం నాయకులు బరకాలు కప్పి ఉన్న ధాన్యం బస్తాలను, ధాన్యాన్ని పరిశీలించారు.