సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
ప్రకాశం: మార్కాపురం మండలం కొట్టాలపల్లిలో ఎమ్మెల్యే సతీమణి వసంత లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారుడైన పంబ శ్రీనుకు శుక్రవారం అందజేశారు. ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే సతీమణి తెలిపారు. లబ్ధిదారుడు ఎమ్మెల్యే కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.