41 ఏండ్ల తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులు
JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట జడ్పీ హైస్కూల్లో 1983-84లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సమావేశమయ్యారు. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసిన వారంతా పాఠశాల ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సవాల మధ్య గడిపారు. అప్పట్లో తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు అంతయ్య, నరసింహమూర్తి, మాణిక్యంలను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.