స్కూల్‌లో భారీ కొండచిలువ

స్కూల్‌లో భారీ కొండచిలువ

పల్నాడు(M) నూజెండ్లలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలోని మోడల్ స్కూల్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ఓ విద్యార్థి టాయిలెట్‌కు వెళ్తుండగా పామును చూసి కేకలు వేశాడు. అది గమనించిన పాఠశాల సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు దానిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించడందో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.