జిల్లాలో మండుతున్న ఎండలు

జిల్లాలో మండుతున్న ఎండలు

NZB: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని అధికారులు తెలిపారు. అటు మెండోరాలో 45.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగానే ఉంది.