వైద్య విద్యార్థిని సన్మానించిన ఏసీపీ
HNK: కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉచిత వైద్య సీటును పొందిన కందగట్ల భవానిని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సన్మానించారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేసే మోహన్ కూతురుకి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంబీబీఎస్‌లో సీటు దక్కించుకుంది. ఈ సందర్భంగా సీఐ వెంకన్న, వరంగల్ సీఐ సుజాత పాల్గొన్నారు