VIDEO: గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం షురూ
గద్వాల జిల్లాలోని మల్దకల్ మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల సందడి మొదలైంది. మరో కొన్ని రోజుల్లో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా ప్రారంభించారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమదైన శైలిలో ఆదివారం నుంచే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.