ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

కోనసీమ: కొత్తపేట మండలం బండారుపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంతాడి చిన్నా(22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు వివరాల ప్రకారం శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన చిన్నా.. ఆదివారం తెల్లవారుజామున పశువుల పాకలో ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.