ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరి: కలెక్టర్
SRPT: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి తేజస్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వాడుకోవాలని కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేటతో సహా 8 మండలాల్లోని ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.