'వృత్తి కులాలకు రూ.25 వేల కోట్లు కేటాయించాలి'
MNCL: రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తి కులాలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యాంత్రీకరణ, కార్పొరేట్ సంస్థల వల్ల వృత్తి కులాలపై ఆధారపడి జీవిస్తున్న 25 లక్షల మందికి ఉపాధి కరువైందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి వారికి ఉపాధి కల్పించాలని కోరారు.