VIDEO: గోదావరికి మళ్లీ పెరిగిన వరద

VIDEO: గోదావరికి మళ్లీ పెరిగిన వరద

E.G: శాంతించిన గోదావరి ఇప్పుడు మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గురువారం రాత్రి 11.30 అడుగులకు నీటిమట్టం నమోదయింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు 9. 20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.