VIDEO: దేవుడి మీద ఒట్టేసి చెప్పు.. ఓటు నాకే వేశావా?
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి ఓ అభ్యర్థిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. నార్కట్‌పల్లి (M) ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి తాను గెలుస్తానని నమ్మి రూ.10 లక్షలు ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని దేవుడి ఫొటోతో ఇంటింటికీ తిరిగాడు. ఓటు వేసినట్లుగా ప్రజల చేత దేవుడిపై ఒట్టేపించుకున్నాడు. అందరూ ఓట్లు వేశారంటే నేను ఎలా ఓడిపోయాను? అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.