నేటి నుంచి వ్యాసెక్టమీ క్యాంపులు
KNR: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వ్యాసెక్టమీ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించబడుతుందని డీఎంహెస్‌వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురుషులకు కోత కుట్టులేని వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ చేయబడును. అర్హులైన దంపతుల నుంచి పురుషులందరూ వినియోగించుకోగలరని అన్నారు.