ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
SS: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై MLA కందికుంట వెంకటప్రసాద్ సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 30న జరిగే ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున, చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ అర్చకులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.