విశాఖ–విజయవాడకు ‘నైట్ రైడర్’ బస్సు
విశాఖ-విజయవాడ మార్గంలో సరికొత్త ‘నైట్ రైడర్’ ఏసీ సర్వీస్‌ను ఆర్టీసీ ప్రారంభించింది. ఈ బస్సులో సీటర్, స్లీపర్ సౌకర్యాలు ఉండగా, ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుంది. అదనంగా ఏసీ బస్సుల టైమింగ్స్‌లో మార్పులు చేసి ఉదయం 6:00, 8:00, 11:00 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటలకు సర్వీసులు నడపనున్నారు.