మధుపాడలో అగ్నిప్రమాదం

మధుపాడలో అగ్నిప్రమాదం

VZM: గజపతినగరం మండలం మధుపాడ గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీర కన్నంనాయుడు లే అవుట్‌లో ఉన్న మామిడి తోట మంటల్లో కాలిపోవడంతో సుమారు రూ.20 వేల ఆస్తి నష్టం జరిగింది. కాల్చిన సిగరెట్‌ను ఆర్పకుండా పారవేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్నఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.