అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

W.G: పాలకొల్లు మండలం కాపవరం గ్రామంలో గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ₹.1.72 లక్షల నిధులతో బ్రాంచ్ పంట కాలవ గట్టుకు రక్షణగా గోడ మరియు గ్రానైట్ రోడ్లు, పైపులైన్ల పునర్మాణం కొరకు ఇంటింటికి త్రాగునీరు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.