మురుగునీటితో అవస్థలు

అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపాలిటీ 9వ వార్డు శాంతినగర్‌లోని కాలువ నుంచి మురుగునీరు బయటకు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఈ మురుగునీరు పక్కనే ఉన్న చేతిబోరు వద్ద చేరడంతో పాటు రోడ్డుపై పారడంతో మరింత అధ్వానంగా మారిందని వాపోతున్నారు. కొంత కాలంగా ఇక్కడ మురుగునీటితో బేజారవుతున్నామని, ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.