జిల్లాలో ప్రారంభమైన టేబుల్ టెన్నిస్ పోటీలు
విశాఖలో 40వ అఖిల భారత తపాలా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమైంది. MVP కాలనీ, S3 స్పోర్ట్స్ వేదికగా ఈ నెల 14 వరకు జరిగే ఈ టోర్నీని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ BP. శ్రీదేవి ప్రారంభించారు. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ముఖ్యమని ఆమె తెలిపారు. అర్జున అవార్డు గ్రహిత నీలంసెట్టి లక్ష్మి విశిష్ట ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.