నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక

పార్లమెంట్ భవన్‌లో నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. కాగా ఈ ఎన్నికల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 430 మంది ఎంపీల మద్దతు ఉండగా.. ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 324 మంది మద్దతు పలికారు. ఈ ఎన్నికకు BRS, BJD పార్టీలు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. సా. 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.