ట్రోల్స్‌పై జాన్వీ కపూర్ స్పందన

కృష్ణాష్టమి వేడుకల్లో నటి జాన్వీకపూర్ 'భారత్ మాతాకీ జై' అంటూ ఉట్టి కొట్టడంపై ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా దీనిపై జాన్వీ స్పందించారు. అక్కడ పాల్గొన్నవారు ముందు 'భారత్ మాతాకీ జై' అని అన్నారని, కానీ వారు అన్నది కట్ చేసి తన మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని పొగడడానికి ఒక రోజంటూ ప్రత్యేకంగా ఉండదని, తాను ప్రతిరోజు 'భారత్ మాతాకీ జై' అని చెబుతానని పేర్కొన్నారు.