పెదపాడు గ్రామంలో వైద్య శిబిరం

ASR: డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీ పరిధి పెద్దపాడు గ్రామంలో వైద్యాధికారి పి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరంలో 45 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం వైద్యాధికారి రాంబాబు మాట్లాడుతూ.. కాచి చల్లర్చిన నీరు తాగాలని, చలి బారి నుంచి రక్షణ కోసం రగ్గులు, ఉన్ని దుస్తులు తప్పక ధరించాలని సూచించారు.