"అధికారులే చట్టాలను తుంగలో తొక్కుతున్నారు"

BDK: భద్రాద్రి ఏజెన్సీ జిల్లాలో గిరిజన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. 1/70, పీసా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆదివారం చుంచుపల్లిలో జరిగిన సమావేశంలో చెప్పారు.చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే వాటిని తుంగలో తొక్కుతూ గిరిజన ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు.