ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పార్టీ వైసీపీ: ఎమ్మెల్యే కళా
VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు శనివారం అలజంగి గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని దుయ్యబట్టారు. వైసీపీలో నాయకులకు గుర్తింపు లేకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పరిపాలించారని, ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుందని అన్నారు.