డ్రంక్ & డ్రైవ్.. జరిమానా విధింపు
MDK: తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన ఏక్ నాథ్‌కు రూ. 10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు తూప్రాన్ ఎస్సై ఇవాళ గంగరాజు తెలిపారు. ఇటీవల పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టగా డీసీఎం డ్రైవర్ ఏకనాథ్ మద్యం సేవించి పట్టుబడినట్లు వివరించారు. ఆయన్ని తాజాగా కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జరిమానా విధించినట్లు వెల్లడించారు.