'రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి'

'రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి'

KMM: తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో బుధవారం స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరీం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు. దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసిన మహోన్నత నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.