బాలియాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్
SKLM: జలుమూరు (M) శ్రీముఖలింగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బాలియాత్రలో ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి. అశోక్ బాబు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.