పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఫైర్
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. 'పవన్ అవకాశవాది. ఎక్కడ ఉంటే అక్కడి పాట పాడతారు. బీజేపీ అనుకూలంగా ఉంటే ఒకలాగ, టీడీపీతో పొత్తులో ఉంటే మరోలా ఉంటారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ ఆంధ్ర-తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే విధంగా స్టేట్‌మెంట్ ఇవ్వడం సరికాదు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం' అని పేర్కొన్నారు.