మాజీ సీఎంని కలిసిన వైసీపీ సీనియర్ నాయకుడు
W.G: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆచంటకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వైట్ల కిషోర్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలితపై ఆయన రచించిన 'విప్లవ నాయకి' గ్రంథాన్ని జగన్‌కు అందచేశారు. అనంతరం తాజా రాజకీయాంశాలపై మాట్లాడినట్లు కిషోర్ తెలిపారు.