వందేమాతరం గేయం ఆలాపన చేసిన జిల్లా కలెక్టర్
కృష్ణా: వందేమాతరం గేతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగులతో కలిసి సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.