పిడుగు పడి మహిళ మృతి

పిడుగు పడి మహిళ మృతి

VZM: ఎల్ కోట మండలం వేచలపువానిపాలెంకు చెందిన నెక్కల ఈశ్వరమ్మ(36) పిడుగు పడి మృతి చెందింది. ఈమె శనివారం తన వరి పొలంలో కలుపు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమెపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ఆమె సొమ్మసిల్లిపోవడంతో స్థానికులు పీహెచ్‌సీకి  తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు ఎస్సై నవీన్ పడాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.