అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
KNR: గునుకుల కొండాపూర్ గ్రామంలో సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన దాడిలో 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీటీసీఎస్ సురేందర్ నేతృత్వంలో జరిగిన ఈ చర్యలో కాసింపేట్ గ్రామానికి చెందిన బొజ్జ ఐలయ్య అనే వ్యక్తి అక్రమంగా బియ్యం తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఈ మేరకు పట్టుబడిన బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేశారు.