'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
KMM: ప్రస్తుతం పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్సై సూచించారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో గురువారం కౌన్సిలర్ చిలక కోటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' సభలో వారు పాల్గొని మాట్లాడారు.