ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: నాదెండ్ల

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: నాదెండ్ల

AP: తూర్పు గోదావరి అనపర్తిలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి పంచసూత్రాల కరపత్రాలు పంపిణీ చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. గతేడాది కంటే రూ.72 అధికంగా ఈ ఏడాది చెల్లిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు రూ.14 వేల కోట్లు సిద్ధం చేశామని చెప్పారు.