డ్రైనేజీ ప్రక్షాళనకు ప్రణాళిక

ELR: నూజివీడు పట్టణ పరిధిలో భారీగా మురుగునీరు నిలిచి ఉండడాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ గురువారం పరిశీలించారు. వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. నిలిచిన మురుగునీటి ప్రక్షాళన కోసం కల్వర్టు, డ్రైనేజి నిర్మించడంతోపాటు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరొక ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.