టీటీసీ కోర్సుకు దరఖాస్తులు ప్రారంభం
NRML: ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడే 42 రోజుల టీటీసీ కోర్సుకు ఏప్రిల్ 18 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈవో భోజన్న శుక్రవారం తెలిపారు. పదో తరగతిపై చదువు పూర్తి చేసి, లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కలిగిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.