జేడీయూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెస్టు

జేడీయూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెస్టు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ మద్ధతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్య కలకలం రేపింది. దులార్‌చంద్ హత్య కేసులో జేడీయూ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత్ అనుచరులు మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్ అనే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణకు వారిని పాట్నాకు తరలించినట్లు సమాచారం.