రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ASR: రంపచోడవరం గాంధీనగర్‌లో ఆదివారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో చిన్న గెద్దాడ గ్రామానికి చెందిన వీరభద్రం (25) మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో వీరభద్రం ఆసుపత్రికి తీసుకురాగానే మృతి చెందాడని సీఐ నాయుడు తెలిపారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.