గాంధీ డ్యూటీ డాక్టర్లతో HRC చర్చలు
HYD: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (TSHRC) బృందం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నిన్న సందర్శించింది. మానవ హక్కుల సంరక్షణ చట్టం, 1993 సెక్షన్ 12(సి) ప్రకారం నిర్వహణలో భాగంగా పర్యటించారు. ఈ బృందం అత్యవసర విభాగాన్ని పరిశీలించి, డ్యూటీ డాక్టర్లతో రోగుల సంరక్షణ, సేవల అందుబాటు, మౌలిక సదుపాయాలపై చర్చించింది.