వేణుగోపాలస్వామిని దర్శించుకున్న మంత్రి
NGKL: మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం జటప్రోలులోని మదన వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.