మద్యం మత్తులో యువతి వీరంగం

మద్యం మత్తులో యువతి వీరంగం

TG: HYD బంజారాహిల్స్‌లోని స్టడీ సర్కిల్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఆమె.. బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించి, పోలీసులతో వాగ్వాదానికి దిగి వారి విధులకు ఆటంకం కలిగించింది. దీంతో పోలీసులు ఆమె వాహనాన్ని సీజ్ చేసి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేశారు.