జిల్లాలో బీజేపీ నేతల సంబరాలు

KNR: దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి కరీంనగర్ జిల్లా పక్షాన సెల్యూట్ చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో జిల్లాలో బుధవారం సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ నేతలు ఉత్సాహంగా పాల్గోన్నారు.