జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో JNV విద్యార్థుల ప్రతిభ
KRNL: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పోటీ పరీక్షలో నవోదయ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ పద్మావతి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 39 మంది పరీక్షలు రాయగా 33 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.