VIDEO: పగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు
SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో విద్యుత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.