రైతు సంఘాల సదస్సు కార్యక్రమం
NZB: తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రం తీసుకొచ్చిన విత్తన చట్టం 2025 ముసాయిదా అనే అంశంపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిన్న సాయంత్రం రైతు సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, విధాన విశ్లేషకులు దొంతి నర్సింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.