మెనూ ప్రకారం ఆహారం అందించాలి: కలెక్టర్
PDPL: రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు 100% మెనూ ప్రకారం ఆహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆయన ఇవాళ విద్యాసంస్థల వంట మనుషులతో సమీక్ష నిర్వహించారు. వంట పదార్థాలను పరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేయాలని తెలిపారు. ఆహార నాణ్యత పై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DMHO ప్రమోద్ కుమార్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.